హైద్రాబాద్ నగరంలోని ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ కంపెనీలో ఆదివారంనాడు స్లాబ్ కూలింది.
హైదరాబాద్: నగరంలోని ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ కంపెనీలో ఆదివారం నాడు స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
తెలంగాణలోని స్లాబ్ కూలి కార్మికులు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. హైద్రాబాద్ కూకట్ పల్లిలో నిర్మాణంలో భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 8న ఈ ఘటన చోటు చేసుకుంది. స్లాబ్ కుప్పకూలి స్లాబ్ కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఐదు రోజుల్లో రెండు అంతస్తుల స్లాబ్ లు ఏర్పాటు చేశారు. ఈ స్లాబ్ కుప్పకూలింది.
ఇదే తరహాలో మహారాష్ట్రలోని పుణెలో స్లాబ్ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘటన 2022 ఫిబ్రవరిలో జరిగింది. 2016లో పుణెలో స్లాబ్ కూలిన ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు.