మళ్లీ విచారణ లేదు: 9 గంటల పాటు మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిలను విచారించిన సీబీఐ

By narsimha lodeFirst Published Dec 1, 2022, 8:18 PM IST
Highlights

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ , టీఆర్ఎస్  ఎంపీ గాయత్రి రవిలను సీబీఐ విచారణ ముగిసింది. సుమారు  9 గంటల పాటు విచారణ సాగింది.  నకిలీ ఐపీఎస్  అధికారి శ్రీనివాస్  కేసులో సీబీఐ అధికారులు  ఈ ఇద్దరిని  ఇవాళ విచారించారు. 

న్యూఢిల్లీ: మళ్లీ తమను విచారణకు రావాల్సిన అవసరం  లేదని సీబీఐ అధికారులు చెప్పారని  తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్  చెప్పారు. నకిలీ ఐపీఎస్  అధికారి శ్రీనివాసరావు కేసులో  తొమ్మిదిగంటల పాటు  తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ , టీఆర్ఎస్  ఎంపీ  రవిచంద్రను  సీబీఐ అధికారులు  గురువారంనాడు విచారించారు.విచారణ ముగిసిన తర్వాత  న్యూఢిల్లీలో ఇవాళ రాత్రి మంత్రి గంగుల కమలాకర్  మీడియాతో మాట్లాడారు. 

మున్నూరు కాపు సమావేశంలో  నకిలీ ఐపీఎస్  అధికారిశ్రీనివాస్ నను కలిసినట్టుగా  మంత్రి గంగుల కమలాకర్  చెప్పారు. మున్నూరు కాపు బిడ్డ ఐపీఎస్  అధికారి అని  తాము అతనిని  రెండుసార్లు  కలిసినట్టుగా  మంత్రి చెప్పారు. నకిలీ ఐపీఎస్  అధికారి  శ్రీనివాసరావుతో తమకు  ఉన్న సంబంధాలపై సీబీఐ అధికారుల ప్రశ్నలకు  సమాధానాలు చెప్పినట్టుగా ఆయన వివరించారు. ఎంపీ గాయత్రి రవితో పాటు  తనను వేర్వేరుగా విచారించినట్టుగా  మంత్రి తెలిపారు. అంతేకాదు  నిందితుడు శ్రీనివాసరావు సమక్షంలో తమను విచారించారన్నారు. చట్టంపై , న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. అందుకే నిన్న నోటీసులు ఇచ్చి   ఇవాళ  విచారణకు రావాని  కోరితే  విచారణకు హాజరైనట్టుగా  మంత్రి తెలిపారు. సీబీఐ అధికారులు సేకరించిన డేటా ఆధారంగా  తమను ప్రశ్నించారన్నారు. తాము జరిగిన విషయాలను తాము సీబీఐకి  వివరించామన్నారు.  తాము ఎలాంటి తప్పులు చేయలేదని  మంత్రి గంగుల కమలాకర్  చెప్పారు. తాము ఇచ్చిన  స్టేట్ మెంట్ పై సంతకాలు తీసుకున్నారన్నారు. 

also read:నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు:హైద్రాబాద్‌లో నలుగురు వ్యాపారులకు సీబీఐ నోటీసులు

నకిలీ ఐపీఎస్  అధికారి  కొవ్విరెడ్డి శ్రీనివాసరావును మూడు రోజుల క్రితం  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  తమిళనాడు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో  నకిలీ ఐపీఎస్  అధికారి  శ్రీనివాసరావు పలువురి నుండి  డబ్బులు వసూలు చేశారని  సీబీఐ గుర్తించింది. నకిలీ ఐపీఎస్  అధికారి శ్రీనివాసరావుకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రతో  దిగిన ఫోటోలు, కాంటాక్టు నెంబర్లు ఉన్న విషయాన్ని సీబీఐ గుర్తించింది. దీంతో  నిన్న సీబీఐ అధికారులు మంత్రి గంగుల  కమలాకర్ , టీఆర్ఎస్  ఎంపీ  గాయత్రి  రవికి  నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని  కోరారు. దీంతో  ఇవాళ విచారణకు వీరిద్దరూ  హాజరయ్యారు.ఉదయం  11 గంటల నుండి  విచారణ జరిగింది. 9 గంటల పాటు విచారణ సాగింది.  ఇదే కేసులో  హైద్రాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారులకు  కూడ  సీబీఐ అధికారులు నోటీసులు పంపారు.  రేపు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ  నలుగురు వ్యాపారులు రేపు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. 

click me!