కోరిక తీర్చాలంటూ వాట్సాప్ లో మెసేజ్ లు.. అరెస్ట్

Published : Dec 25, 2018, 10:07 AM IST
కోరిక తీర్చాలంటూ వాట్సాప్ లో మెసేజ్ లు.. అరెస్ట్

సారాంశం

కోరిక తీర్చాలంటూ.. వాట్సాప్ లో ఓ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు చేసి ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు


కోరిక తీర్చాలంటూ.. వాట్సాప్ లో ఓ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు చేసి ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...విజయనగరం బొబ్బపేట ఫేజ్‌-3కి చెందిన లగడపాటి దుర్గాసుధేష్‌బాబు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. గత కొంత కాలంగా ఓ యువతిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

ఆమె  వాట్సాప్‌ నంబర్‌కు తరచూ అసభ్య సందేశాలు పంపించడంతో పాటు శారీరక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. వాటిని భరించలేక బాధితురాలు షీ బృందాన్ని ఆశ్రయించింది. దీంతో నిందితుడిని గుర్తించిన షీ బృందాలు అతడిని అరెస్టు చేసి సోమవారం నగర 14వ స్పెషల్‌ ఎంఎం కోర్టులో హాజరుపరిచడంతో కోర్టు అతడికి ఏడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.250 జరిమానా విధించారు. 

PREV
click me!

Recommended Stories

ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభం? చివ‌రి తేదీ ఎప్పుడు.?
ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతున్నా.. హైదరాబాద్ లో నో వాటర్ ప్రాబ్లమ్ : సీఎం రేవంత్ రెడ్డి