చిన్న వయసులో పర్వతారోహణ.. రాష్ట్రపతి ప్రశంసలు

sivanagaprasad kodati |  
Published : Dec 25, 2018, 09:27 AM IST
చిన్న వయసులో పర్వతారోహణ.. రాష్ట్రపతి ప్రశంసలు

సారాంశం

అతి చిన్న వయసులోనే పర్వతారోహణ చేసిన సాహస బాలుడిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. తెలంగాణ చేనేతను ప్రొత్సహించేందుకు గాను ఈనెల 12న ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మౌంట్ కోసియుస్కోను అధిరోహించారు. 

వీరిలో సికింద్రాబాద్‌లోని బోల్టన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న చిన్నారి సామాన్యు అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విషయం తెలుసుకుని సామాన్యుని తనవద్దకు పిలిపించుకుని అభినందించారు. బాలుడి తల్లిదండ్రులు శ్రీకృష్ణకాంత్, సామాన్యు సోదరి హషిత, రాజీ తమ్మినేని, మడుగుల లావణ్య తదితరులను కూడా రాష్ట్రపతి ప్రశంసించారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం