హైదరాబాద్: బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇంటర్నెట్ టెక్నిషియన్

Arun Kumar P   | Asianet News
Published : Dec 08, 2021, 10:02 AM ISTUpdated : Dec 08, 2021, 10:11 AM IST
హైదరాబాద్: బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇంటర్నెట్ టెక్నిషియన్

సారాంశం

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తూ అడ్డంగా బుక్కయ్యాడు ఓ ఇంటర్నెట్ టెక్నిషియన్. ఈ ఘటన హైదరాాబాద్ లో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: ఇంట్లో ఇంటర్నెట్ సమస్య వుంటే పరిష్కరించడానికి వచ్చిన ఓ టెక్నిషన్ నీచానికి పాల్పడ్డాడు. బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీస్తూ అడ్డంగా బుక్కయి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ (hyderabad) మల్లెపల్లిలోని ఇందిరానగనర్ లో నివాసముండే మార్టిన్ ఇంటర్నెట్ టెక్నిషియన్. బంజారాహిల్స్ లోని ఓ ఇంట్లో ఇంటర్నెట్ (internet) సమస్య వుండటంతో టెక్నిషియన్ అయిన మార్టిన్ ను సంప్రదించారు. దీంతో మంగళవారం అతడు ఇంటర్నెట్ సమస్యను పరిష్కరించడానికి వెళ్లాడు. అయితే ఇదే సమయంలో ఇంట్లో ఓ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా గమనించాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియో (bathing video) తీయసాగాడు. 

అయితే ఈ విషయాన్ని గమనించిన మహిళ గట్టిగా కేకేసింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకోగా వీడియో తీస్తున్న విషయాన్ని తెలిపింది. అప్పటికే పారిపోడానికి సిద్దమైన మార్టిన్ ను పట్టుకుని ఫోన్ చెక్ చేయగా మహిళ బాత్రూం వీడియో (bathroom video) రికార్డయి వుంది. దీంతో అతడికి కుటుంబసభ్యులు, స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. 

read more  ఇంటర్మీడియట్ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్...

బంజారాహిల్స్ (banjarahills) పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలికి చేరుకుని మార్టిన్ ను అదుపులో తీసుకున్నారు. అతడి సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల జూబ్లీహిల్స్ లోని ఓ ఫుడ్ కోర్టు(Food Court)లో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. ఫుడ్ కోర్ట్ లోని మహిళల టాయిలెట్(Woman Toilet) లో తన సెల్ ఫోన్ పెట్టి వీడియోలు(Video Shoot) చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని వన్ డ్రైవ్ ఇన్ (one drive in) లో ఈ దారుణం చోటుచేసుకుంది.

నల్లగొండ జిల్లా (nalgonda district) బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18)  ఈ హోటల్ లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఇతడు తన సెల్ ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి హోటల్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్ లో పైన పెట్టేవాడు. దాంట్లో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు.

మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్ ఫోన్ ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు (jubileehills police) రంగప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను చీత్రీకరించడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడి మీద నిర్భయ చట్టం (nirbhaya act) తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్