ఇంటర్మీడియట్ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్...

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 9:12 AM IST
Highlights

నవంబర్ 30న, 17యేళ్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం కాలేజి కని బయలుదేరిన అమ్మాయి.. ఆ తరువాత అదృశ్యం అయ్యింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ : మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 20 యేళ్ల లోపు వయసు వారే కావడం గమనార్హం. వివరాల్లోకి వెడితే... 17యేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరం వీరిపై మోపబడింది.

నవంబర్ 30న, 17యేళ్ల intermediate student ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం college కని బయలుదేరిన అమ్మాయి.. ఆ తరువాత అదృశ్యం అయ్యింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు missing case నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 3న సుల్తాన్ బజార్ పోలీసులు చాదర్ ఘాట్ లో ఓ ఆటోడ్రైవర్ తో బాలిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు girlను స్వాధీనం చేసుకుని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత భరోసా సెంటర్‌లో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

ఈ వాంగ్మూలంలో ఆమె షాకింగ్ విషయాలు తెలిసింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు తన మీద sexual assaultకు పాల్పడ్డారని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది. ‘మేం ఐదుగురు నిందితులను పట్టుకున్నాం. వీరిలో నలుగురు ఆటో డ్రైవర్లు కాగా, ఒకరు కార్పెంటర్’ అని పోలీసులు తెలిపారు.

బాలిక తెలిపిన వివరాల మేరకు.. కాలేజీకి వెళ్లే సమయంలో బాలికకు నిందితుడితో పరిచయం ఏర్పడింది. అలా వారు ఆమెను ట్రాప్ చేశారు. మూడు రోజుల పాటు, ఒక్కొక్కరు ఒక్కోచోటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను ఒక్క చోట ఉంచకుండా ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతం తిప్పుతూ ఆచూకీ తెలియకుండా చేశారని.. ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ ఎం రమేష్ తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, IPC, POCSO చట్టం, SC & ST (POA) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అత్యాచారం, కిడ్నాప్ కేసు బుక్ చేశామని తెలిపారు. 

పాకిస్తాన్ లో దారుణం.. నలుగురు మహిళలను బట్టలూడదీసి, కొడుతూ.. వీధుల్లో ఊరేగించి, వీడియోతీసి...

ఇదిలా ఉండగా, రెండున్నర ఏళ్ల బాలికపై molestation చేసి murder చేసిన 37 ఏళ్ల వలస కార్మికుడికి గుజరాత్లోని సూరత్లో POCSO Court మరణశిక్ష విధించింది.  సూరత్ లోని పందేసర ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్ కి చెందిన గుడ్డు యాదవ్ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు arrest చేశారు.  ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

ఈ కేసులో 43 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం…  కేవలం 28 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. సోమవారం నిందితుడు గుడ్డు యాదవ్ ను దోషిగా తేల్చిన కోర్టు మంగళవారం మరణశిక్ష ఖరారు చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల Compensation ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

click me!