ఎంగేజ్మెంట్ కు పోతే హెల్మెట్ ఇచ్చారు

Published : Jun 20, 2017, 09:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఎంగేజ్మెంట్ కు పోతే హెల్మెట్ ఇచ్చారు

సారాంశం

గుంపులో గోవిందయ్య అన్నట్లు శుభకార్యం జరుపుకుంటే ఏం బాగుంటుందని వారు భావించారు. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేశారు. శుభకార్యానికి వచ్చి గిఫ్ట్ లు తీసుకున్న అతిథులంతా ఆశ్యర్యపోయారు. ఇదేదో బాగుందని బంధు మిత్రులంతా అభినందించారు.  

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి జిల్లా గంగాధర్, వసంతలక్ష్మి దంపతులు. వీరు తమ కుమారుడు మనీత్ ఎంగేజ్ మెంట్ సోమవారం జరిపారు. ఈ శుభకార్యానికి వచ్చిన అతిథులందరికీ హెల్మెట్ లు గిప్ట్ గా ఇచ్చారు. 2లక్షల రూపాయలు వెచ్చించి 500 హెల్మెట్ లు కొనుగోలు చేసి నిశ్చితార్థానికి వచ్చిన వారందరికీ అందజేశారు.

 

రివర్స్ గిప్ట్ లు ఇవ్వడం చూశాము కానీ ఇలా హెల్మెట్ లు ఇవ్వడం మాత్రం కొత్తగా ఉందన్నారు బంధు మిత్రులు. కొత్త ఆలోచనలు చేసిన యువ జంటను అందరూ అభినందించారు. అయితే రోడ్డు ప్రమాధాల నివారణ కోసం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకాంర చుట్టినట్లు మనీత్ జంట తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్