
తెలంగాణలో గురుకుల మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన పిజిటి మెయిన్స్ వచ్చే నెల 18, 19 తేదీలకు వాయిదా పడ్డాయి.
అలాగే జులై 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన టిజిటి మెయిన్స్ పరీక్షలు జులై 20, 21, 22 తేదీలకు వాయిదా పడ్డాయి.
పిడి పోస్టులకు సైతం జులై 18న పరీక్ష జరగనుంది.
పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద సంఖ్యలో వినతులు వచ్చినందున ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు టిఎస్సీఎస్సీ ప్రకటించింది. వేలాది మంది వ్యక్తిగతంగా వాయిదా వేయాలని కోరినట్లు ప్రకటనలో పేర్కొంది టిఎస్సీఎస్సీ.
మరోవైపు ప్రిలిమినరీ పరీక్షలు జరపకుండా మెయిన్స్ పరీక్షలకు తేదీలు ప్రకటించడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డారు. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించాలని, మెయిన్స్ వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఓయు లో నిరసనలు సైతం చేశారు.
దీంతో దిగివచ్చిన టిఎస్పిఎస్సీ పరీక్ష తేదీలను వాయిదా వేసింది. కానీ ప్రిలిమినరీ ఫలితాలు మాత్రం ఎప్పుడు వెల్లడించేది ఇంకా తేల్చలేదు.