హైదరాబాద్ నుంచి సొంతూరికి.. కరోనా పరీక్ష చేయడంతో..

By telugu news teamFirst Published Jul 3, 2020, 11:40 AM IST
Highlights

సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మార్టులో పనిచేస్తుంటాడని, షాపులో ఉన్న వారందరికి  కరోనా పరీక్షలు జరపగా అతనికి పాజిటీవ్‌ వచ్చినట్లు తమకు సమాచారం అందించారని చెప్పారు. 

అతనికి హైదరాబాద్ లో ఉద్యోగం. ఇక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకునేవాడు. ఇటీవల సొంతూరికి వెళ్లాడు. కాగా... అక్కడ అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అక్కడ కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాయిరెడ్డిపల్లిలో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు నెక్కొండ ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్‌ రమేశ్‌  గురువారం తెలిపారు. సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మార్టులో పనిచేస్తుంటాడని, షాపులో ఉన్న వారందరికి  కరోనా పరీక్షలు జరపగా అతనికి పాజిటీవ్‌ వచ్చినట్లు తమకు సమాచారం అందించారని చెప్పారు. 

హైదరాబాద్‌లో పరీక్షను నిర్వహించగా, రిపోర్టు రాకముందే  గ్రామానికి వచ్చినట్టు తెలిపారు. కాగా అతను నెక్కొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెండు రోజుల క్రితం  వచ్చిన  సమాచారం ఉండటంతో  సదరు ఆస్పత్రిని 14 రోజులు తెరవవద్దని, డాక్టర్‌ను హోంక్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుమల్‌, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, ఎస్సై నాగరాజు, పాల్గొన్నారు.

click me!