ముక్కు పుడక కోసం... పూడ్చిన శవాన్ని వెలికితీసి..

Published : Jul 03, 2020, 09:50 AM IST
ముక్కు పుడక కోసం... పూడ్చిన శవాన్ని వెలికితీసి..

సారాంశం

అంత్యక్రియలు చేసే సమయంలో మృతదేహానికి రెండు బంగారు ముక్కు పుడకలు ఉండటాన్ని కాపరి గమనించాడు. దీంతో.. వాటిపై ఆ కాపారి కన్ను పడింది.   

బంగారు ముక్కపుడక కోసం ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. చనిపోయిన మహిళను ఖననం చేసిన తర్వాత.. ముక్కు పుడక కోసం మళ్లీ శవాన్ని బయటకు తీశాడు. ఈ దారుణ సంఘటన గురువారం మెదక్ పట్టణంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ పట్టణం గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ(80) గత నెల 24న అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక గిద్దకట్ట శ్మశాన వాటికలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. అంత్యక్రియలు చేసే సమయంలో మృతదేహానికి రెండు బంగారు ముక్కు పుడకలు ఉండటాన్ని కాపరి గమనించాడు. దీంతో.. వాటిపై ఆ కాపారి కన్ను పడింది. 

అక్కడి కాటికాపరి యాదగిరి సంబంధీకులు ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి రెండు ముక్కు పుడకలు తీసుకున్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుమారుడు ఊశయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!