తాగిన మైకంలో వేరే ఇంట్లోకి.. దొంగ అనుకుని వారు చేసిన పనితో.. అతని ప్రాణాలు కోల్పోయి...

Published : Dec 27, 2022, 10:26 AM IST
తాగిన మైకంలో వేరే ఇంట్లోకి.. దొంగ అనుకుని వారు చేసిన పనితో.. అతని ప్రాణాలు కోల్పోయి...

సారాంశం

తండ్రి వర్థంతికి వెళ్లి వస్తూ.. పొరపాటున తాగిన మైకంలో వేరే ఇంట్లోకి వెళ్లాడో వ్యక్తి. అతడిని దొంగ అనుకున్న ఆ ఇంటివారు చావచితకబాదారు.

మంచిర్యాల : మంచిర్యాలలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో చేసిన చిన్న పొరపాటు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి తన ఇల్లనుకుని వేరే ఇంట్లోకి వెళ్లాడు. వారు అతడిని దొంగ అనుకుని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ ఘటన కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. మృతుడు కాసిపేట మండలం దేవాపూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి మురళి(35) అని దేవాపూర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.విజయేందర్‌ తెలిపారు. నిందితుడు కొండాపూర్‌కు చెందిన భూమయ్య.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. మురళి (35) అనే వ్యక్తి తాగిన మత్తులో ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో భూమయ్య అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. అయితే, వెంటనే అతడిని గమనించిన భూమయ్య కుటుంబసభ్యులు దొంగగా భావించారు. వెంటనే అతడిని కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని అరుపులు విన్న స్థానికులు.. అతడిని కాపాడి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ గాయాల కారణంగా చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం మురళి మరణించాడని వైద్యులు నిర్థారించారు. దీంతో పోలీసులు మురళి మరణానికి కారకుడైన భూమయ్య మీద హత్యానేరం నమోదు చేశారు. 

ఆ సాక్ష్యాలు సీఎంకు ఎవరిచ్చారు: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మందమర్రి ఇన్ స్పెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. మురళి దేవాపూర్ లోని తన ఇంటికి వెళ్లాల్సి ఉంది. అయితే పొరపాటున భూమయ్య ఇంటికి వెళ్లాడు. మురళి ఇంట్లోకి వెడుతుంటేనే అతడిని కుటుంబసభ్యులు గుర్తించారు. ఇంట్లోకి దొంగ చొరబడ్డాడనుకున్నారు. దీంతో భూమయ్య పెద్ద కర్రతో మురళి మీద దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 

మురళి దేవాపూర్ లోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. జగిత్యాలలోని ఎండపల్లి గ్రామంలో తండ్రి సంవత్సరీకానికి హాజరయ్యాడు. తిరిగి వెళ్లే సమయంలో కొండాపూర్ లోని ఓ మద్యం దుకాణంలో  మద్యం సేవించి బస్‌బేలో నిద్రించాడు.  తాగి ఉండడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మేలుకుని..నడుచుకుంటూ.. తన ఇల్లే అనుకుని భూమయ్య ఇంట్లోకి వెళ్లాడు. అదే అతడి మరణానికి కారణంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్