బావమరిదిని చంపిన బావ, నిందితుల ఇళ్లు ధ్వంసం, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Dec 29, 2019, 11:00 AM IST

స్వంత బావ మరిదిని బావ అత్యంత దారుణంగా హత్య  చేశాడు. స్నేహితులతో కలిసి  బావమరిదిని హత్య చేశాడు. నిందితుల ఇళ్లను మృతుల కుటుంబసభ్యులు దాడి చేశారు. 


నిజామాబాద్: ఓ యువకుడిని స్వంత బావే దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని బావిలో పారేశాడు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేశారు.

 నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన వారి ఇళ్లపై బాధిత కుటుంబసభ్యులు  దాడి చేశారు.  నిందితులను తమకు అప్పగించాలని బాధిత కుటంబసభ్యులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

Latest Videos

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లికి చెందిన పాపన్నగారి శేఖర్  మృతదేహాం మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని బావిలో దొరికింది. శేఖర్ ను అతడి బావ పోతుల శేఖర్ ఆయన స్నేహితుడు బిక్షపతి గురువారం నాడు హత్య చేశారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా రామయంపేట శివారులోని బావిలో వేశాడు.

మృతదేహం విషయం వెలుగు చూడడంతో  నిందితుడు పోతుల శేఖర్ పోలీసులకు లొంగిపోయాడు.  ఈ విషయం తెలిసిన పాపన్నగారి శేఖర్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఉదయం  పోతుల శేఖర్ రెండు ఇళ్లను ధ్వంసం చేశారు. అంతేకాదుశేఖర్ కు సహకరించిన భిక్షపతి ఇంటిపై కూడ మృతుడి గ్రామస్తులు దాడి చేశారు.

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భఆరీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించడం వల్ల  ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. 

click me!