భర్తతో విడిపోయిన కోడలిపై కన్నేసిన మామ.. చివరకు

Published : Oct 31, 2018, 02:27 PM ISTUpdated : Oct 31, 2018, 05:59 PM IST
భర్తతో విడిపోయిన కోడలిపై కన్నేసిన మామ.. చివరకు

సారాంశం

ఆపదలో అండగా ఉంటారనే భరోసాతో అయినవారి పంచన చేరింది. అయితే.. బాధలో ఉన్న ఆమెను ఓదార్చాల్సిందిపోయి.. ఆమెపై కన్నేశాడు

మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ బిడ్డలతో సహా ఒంటరిగా నివసిస్తోంది.  ఆపదలో అండగా ఉంటారనే భరోసాతో అయినవారి పంచన చేరింది. అయితే.. బాధలో ఉన్న ఆమెను ఓదార్చాల్సిందిపోయి.. ఆమెపై కన్నేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం, అద్నూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లింగంపల్లిలోని తారానగర్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. సంగారెడ్డికి చెందిన ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె అతడికి వరుసకు మేనకోడలు అవుతుంది.  ఒంటరిగా ఉన్న మేనకోడలిపై కన్నేశాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. అవసరం లేకుండానే అన్ని పనులు చేసిపెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆమెను లొంగదీసుకొని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం అతనికి భార్యకు తెలియడంతో.. గొడవలు జరిగాయి. దీంతో.. ఆమె అతనికి దూరంగా వెళ్లి పోయి తన జీవితం తాను గడుపుతోంది. అయితే.. మేనకోడలితో ఇంకా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య గొడవచేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అతను.. మేనకోడలు ఎక్కడ ఉంటుందో కనుక్కొని చంపేందుకు ప్రయత్నించాడు. స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

PREV
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం