టెక్కీ ప్రశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: ప్రణయ్‌తో వివాహేతర సంబంధం, మరో ఆడియో టేపు

By narsimha lodeFirst Published Oct 31, 2018, 2:26 PM IST
Highlights

: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య పావనిని బుధవారం నాడు  పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య పావనిని బుధవారం నాడు  పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వేధింపులు భరించలేక  ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.  తన చావుకు తన భార్య కారణమని  ప్రశాంత్ ‌సూసైడ్ లేఖ రాశాడు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేసిన  చేసిన పోలీసులు  పావనిని అరెస్ట్ చేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ప్రశాంత్, పావనిలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.  అయితే వీరిద్దరి మధ్య  ప్రణయ్ అనే వ్యక్తి కారణంగా గొడవలు  ఏర్పడ్డాయి.

ప్రియుడు ప్రణయ్‌తో వివాహేతర సంబంధాన్ని మానాలని భర్త ప్రశాంత్ భార్య పావనిని కోరాడు.  ఈ సంబంధం మాన్పించేందుకు గాను పావనిని బెంగుళూరు పంపించాడు. కానీ, ఆమె మాత్రం తన పద్దతులను మార్చుకోలేదు.  దీంతో భార్యతో ఫోన్లో  పద్దతి మానుకోవాల్సిందిగా ప్రశాంత్ బతిమిలాడాడు.

భర్త ప్రశాంత్‌తో ఫోన్లో పావని పరుషంగా మాట్లాడింది. గత ఏడాది డిసెంబర్ ముందు ఎలా ఉన్నావో అలానే ఉండాలని పావనిని భర్త ప్రశాంత్ కోరారు. 2014 డిసెంబర్ ముందు ఎలా ఉన్నామో అదే జీవితం ఇవ్వాలని ఆమె కోరింది.

కానీ, గత ఏడాది డిసెంబర్ ముందు ఎలా ఉన్నావో అలా ఉండాలని భార్యను ప్రశాంత్ కోరాడు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందామని ప్రశాంత్  భార్య పావనిని ప్రాధేయపడ్డాడు.  ఆమె తన ప్రియుడు ప్రణయ్‌ను మాత్రం వదులుకొనేందుకు సిద్దంగా లేదు.  ప్రియుడు ప్రణయ్‌ను ఒక్క మాట కూడ అంటే సహించలేకపోయింది. రెచ్చగొట్టొద్దంటూ భర్త ప్రశాంత్‌ను పావని హెచ్చరించింది.

భార్య పావనితో  భర్త ప్రశాంత్ ‌ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను పోలీసులు  సేకరించారు. ఈ సంభాషణ ఆధారంగా పోలీసులు ఆమెను విచారించి అరెస్ట్ చేశారు. 

సంబందిత వార్తలు

టెక్కీ ఆత్మహత్యలో ట్విస్ట్: భార్యకు మరో వ్యక్తితో లింక్, బయటపడ్డ ఆడియో

click me!