క్వారంటైన్ లో కుటుంబ సభ్యులు, అనాథ శవంగా అంత్యక్రియలు చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది

By Sree s  |  First Published Jun 1, 2020, 5:43 PM IST

అంత్యక్రియలు చేయాల్సిన భార్య పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు. పెద్ద కూతురు హోమ్ క్వారంటైన్ లో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. బంధువులెవరు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. దానితో ఎవ్వరూ లేకపోవడంతో ఎర్రగడ్డ స్మశానవాటికలో జిహెచ్ఎంసి సిబ్బంది ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. 


హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. అతడికి కరోనా సోకడంతో అతడిని గాంధీ ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించారు. ఆయన కుటుంబ సభ్యులను టెస్ట్ చేయగా ఆ వ్యక్తి భార్యకు, చిన్న కూతురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దానితో అతని భార్యను చిన్న కూతురిని గాంధీకి తరలించారు. పెద్ద కూతురిని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. 

చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. కుటుంబ సభ్యులకు గదిలోని మార్చరీలో శవాన్ని చివరిచూపు చూసుకునే అవకాశం కల్పించారు. అంత్యక్రియలు చేయాల్సిన భార్య పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు. పెద్ద కూతురు హోమ్ క్వారంటైన్ లో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. 

Latest Videos

undefined

బంధువులెవరు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. దానితో ఎవ్వరూ లేకపోవడంతో ఎర్రగడ్డ స్మశానవాటికలో జిహెచ్ఎంసి సిబ్బంది ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. 

వస్త్రవ్యాపారి కరోనా సోకి మరణించడంతో ఆ మార్కెట్ వారంతా భయాందోళనలకు లోనవుతున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్నంతా అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటి సర్వే జరిపారు. అతడితో కలిసిన వారు, లక్షణాలున్నవారు ఇలా సాద్యమైనంతమంది కి టెస్టులను నిర్వహిస్తున్నారు. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే  విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. 

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి  స్ధాయి  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో  కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి  9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.

 
ఇక జూన్ 8 తర్వాత  సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు.  సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.  

click me!