యువతిపై అఘాయిత్యం: శీలానికి రూ.2 లక్షలు వెల, పంచుకున్న పెద్దలు

By Siva KodatiFirst Published Jun 1, 2020, 2:31 PM IST
Highlights

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం దూసుకెళ్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామ సీమల్లో మూఢనమ్మకాలతో పాటు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించకుండా తమలో తాము పరిష్కరించుకుంటూ నేరస్తులకు అనారికమైన శిక్షలను విధిస్తున్నారు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం దూసుకెళ్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామ సీమల్లో మూఢనమ్మకాలతో పాటు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించకుండా తమలో తాము పరిష్కరించుకుంటూ నేరస్తులకు అనారికమైన శిక్షలను విధిస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్పుడప్పుడూ వార్తలను వింటూ వుంటాం.

Also Read:మైనర్‌ బాలికపై లైంగిక దాడి: శీలానికి వెల కట్టిన పెద్దలు

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే. వరంగల్ రూరల్ జిల్లా రామపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి, పక్క గ్రామానికి చెందిన అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అతను చేసిన నేరంపై గ్రామస్తులు.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడికి శిక్షగా రూ.2 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.

Also Read:గిన మైకంలో స్నేహితుడి భార్య శీలంపై కామెంట్స్... చివరకు.

ఆ మొత్తాన్ని పెద్ద మనుషులే తలాకొంత పంచుకున్నట్లు తెలిసింది. అయితే బాధితురాలి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో గ్రామస్తులు పెద్ద మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!