తెలంగాణ మందుబాబులకు శుభవార్త: రాత్రి 8 గంటల వరకు వైన్ షాపులు

By telugu team  |  First Published Jun 1, 2020, 5:25 PM IST

తెలంగాణలో మందుబాబులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో వైన్ షాపులు ఇక ముందు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటున్నాయి..


హైదరాబాద్: తెలంగాణలోని మందుప్రియులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం తీపి వార్తను అందించింది. తెలంగాణలోని వైన్ షాపులు ఇక ముందు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచడానికి ప్రభుత్వం వైన్ షాపులకు అనుమతి ఇచ్చారు. 

ఇప్పటి వరకు తెలంగాణలో వైన్ షాపులు సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటున్నాయి. రాత్రి కర్ఫ్యూ సాయంత్రం 7 గంటల నుంచి అమలులో ఉన్నందున వైన్ షాపులను 6 గంటలకే మూసేయాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Latest Videos

undefined

అయితే, కేంద్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను కుదించింది. కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటూ వచ్చింది.

ఇదిలావుంటే, ఆదివారం ఒక్క రోజే తెలంగాణలో 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్టంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,698కి చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా ఆదివారం ఆరుగురు మరణించారు. దాంతో మృతుల సంఖ్య 82కు చేరుకుంది. 

జిహెచ్ఎంసి పరిధిలో ఆదివారంనాడు 122 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 10, మహబూబ్ నగర్ లో 3, వరంగల్ అర్బన్ లో 2, సూర్యాపేటలో ొ, నిర్మల్ జిల్లాలో  కేసులు నమోదయ్యాయి. 

మొత్తం కేసుల్లో 434 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వారివల్ల నమోదైనవే. తెలంగాణలో ఇప్పటి వరకు 1,428 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 1,188 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

click me!