గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పైనుంచి పడి వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..

Published : Jul 24, 2023, 08:34 AM IST
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పైనుంచి పడి వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..

సారాంశం

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ వాహనదారుడు కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు టూ వీలర్ మీద ఫ్లైఓవర్ మీదుగా వెళుతున్నారు.  వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టారు. 

దీంతో ఒక ఫ్లై ఓవర్ మీది నుంచి మరో ఫ్లై ఓవర్ మీదికి వారిద్దరు పడిపోయారు. బైక్ మీద వెళుతున్న ఇద్దరిలో ఒకరు ఈ ఘటనలో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన వ్యక్తి  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని గచ్చిబౌలి నివాసి మధు (25)గా  గుర్తించారు. 

పోల్ నుంచి తెగి కంచెపై పడ్డ కరెంట్ తీగ.. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా షాక్ తగిలి కౌలు రైతు మృతి..

ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.  
క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  మధు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?