పుడ్ డెలివరీ బాయ్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి: హైద్రాబాద్ పోలీసుల అదుపులో నిందితుడు

Published : Sep 16, 2022, 03:58 PM IST
పుడ్  డెలివరీ బాయ్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి: హైద్రాబాద్ పోలీసుల అదుపులో నిందితుడు

సారాంశం

గచ్చిభౌలిలో పుడ్  డెలివరీ బాయ్  చేతిలో కత్తిపోట్లకు గురైన  ఆదిత్య  అనే వ్యక్తి మృతి చెందాడు.  వారం రోజులుగా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

హైదరాబాద్: పుడ్ డెలివరీ బాయ్ చేతిలో కత్తిపోట్లకు గురైన ఆదిత్య  అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించాడు. వారం రోజులుగా  నిమ్స్ ఆసుపత్రిలో   ఆదిత్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  పుడ్ డెలీవరీ ఆలస్యమైందనే  విషయమై డెలీవరీ బాయ్ తో గొడవ  ఆదిత్య గొడవ పెట్టుకున్నారు.

ఈ గొడవ సమయంలో కోపం పట్టలేక ఇరువురు కొట్టుకున్నారు.అంతేకాదు  కత్తితో పరస్పరం దాడికి దిగారు. పుడ్  డెలివరీ బాయ్ కత్తితో ఆదిత్యను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆదిత్యను స్ధానికులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆదిత్య ఇవాళ మరణించాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఆదిత్య మరణానికి కారణమైన పుడ్ డెలివరీ బాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం