ఢిల్లీ లిక్కర్ స్కాంలో 12 మందితో పాటు 18 కంపెనీలకు కూడా ఈడీ అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. ఇవాళ దేశంలోని40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో 12 మందికి ఈడీ అధికారులు శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఇవాళ ఈడీ అధికారులు 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉందనే అనుమానాలతో ఈడీ అధికారులు ఇవాళ 18 కంపెనీలతో పాటు 12 మంది కి నోటీసులు ఇచ్చారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చిబాబు, చందన్ రెడ్డి, పెరమన్ రిచర్డ్, విజయ్ నాయర్ ,దినేష్ ఆరోరా, వై. శశికళ, రాఘవ మాగుంట, సమీర్ మహంద్రు తదితరులకు నోటీసులు ఇచ్చారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు:తెలంగాణ సహ నాలుగు రాష్ట్రాల్లో సోదాలు
undefined
ఇండో స్పిరిట్స్, మాగుంటి ఆగ్రోఫామ్స్, ట్రైడెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఆవంతిక కాంట్రాక్టర్స్ , ఆర్గానామిక్స్ ఈకో సిస్టమ్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్ ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ ప్రైజెస్, ప్రీనీస్ ఎంటర్ ప్రైజెస్, జైనాబ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ డిస్టిలరీస్, టెక్రా, ఫెరల్ డిస్టిలరిస్, హివిడే ఎంటర్ ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్ ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్ ప్రైజెస్, పెగాసస్ ఎంటర్ ప్రైజెస్, రాబిన్ డిస్టిలరిస్ లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఇవాళ ఉదయం నుండి ఈడీ అధికారులు నాలుగు రాష్ట్రాల్లోని 40 చోట్ల సోదాలు చేస్తున్నారు. తెలంగాణలోనిహైద్రాబాద్ , ఏపీలో నెల్లూరుతో పాటు వైసీపీకి చెందిన ఓ ఎంపీకి చెందిన కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడు,కకర్ణాటక, రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ లోని జయభేరి అపార్ట్ మెంట్ లోని నివాసం ఉంటున్న వ్యక్తి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైద్రాబాద్ లోని దోమలగూడలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ చార్టెడ్ అకౌంటెంట్ పలువురు ప్రముఖులకు సీఏగా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి చార్టెడ్ అకౌంటెంట్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఆప్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరి ప్రమేయం ఉందని కూడా బీజేపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైద్రాబాద్ కు రాబిన్ డిస్టిలరిస్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై పేరును సీబీఐ చేర్చింది. ఈ నెల 6,7 తేదీల్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఇవాళ మరోసారి సోదాలు చేస్తున్నారు. గతంలో సోదాలు చేసిన సమయంలో రాబిన్ డిస్టిలరిస్ ఆర్ఓసీలో నమోదు చేసిన చిరునామాలో ఆ కంపెనీ కార్యకలాపాలు సాగడం లేదని గుర్తించారు. ఇవాళ హైద్రాబాద్ నగరంలోనే సుమారు 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని సమాచారం.