కల్తీ కల్లుతో ఇవాళ విష్ణు ప్రకాస్ అనే వ్యక్తి మరణించాడు. కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
మహబూబ్‌నగర్: కల్తీ కల్లుకు మరొకరు బలయ్యారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విష్ణు ప్రకాష్ అనే వ్యక్తి బుధవారంనాడు మృతి చెందాడు. కల్తీకల్లుతో జిల్లాలో 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి కల్తీ కల్లు కారణంా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో విష్ణు ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ విష్ణు ఇవాళ మృతి చెందాడు.
కల్తీ కల్లు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలనే ఒకరు మరణించారు. కల్తీ కల్లు పై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కూడా కల్తీ కల్లు కారణంగా పలువరు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాటి చెల్లు లేకపోయినా కూడా కల్లు తయారు చేసి విక్రయించడం ఈ జిల్లాలో యధేచ్ఛగా సాగుతుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ రకమైన పరిస్థితి నెలకొనడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.