కోవిడ్-19 వ్యాక్సిన్ : టీకా తీసుకున్న 45 ని.ల్లోనే వ్యక్తి మృతి.. !

Published : Jun 12, 2021, 09:14 AM IST
కోవిడ్-19 వ్యాక్సిన్ : టీకా తీసుకున్న 45 ని.ల్లోనే వ్యక్తి మృతి.. !

సారాంశం

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా నుంచి కాపాడుతుందని టీకా తీసుకుంటే ఉన్నఫళంగా మనిషి మాయమైపోయాడు. వివరాల్లోకి వెడితే.. హైదరాబాద్ మీర్ పేటలో టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మీర్ పేట రాఘవేంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకుంది. 

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి నర్సింహారెడ్డి (46), అతడి భార్య వాణి శుక్రవారం జిల్లెల గూడలో చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేందరంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.

ఆ తరువాత టూ వీలర్ మీద దగ్గర్లోని తమ టైలరింగ్ షాపుకు వెళ్లారు. అక్కడ సెల్ ఫోన్ చూస్తూ నర్సింహారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుటుంబం సభ్యులు మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించగా.. మార్గ మధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. వ్యాక్సిన్ తీసుకున్న 45 నిమిషాల్లోనే నర్సింహారెడ్డి చనిపోవడాన్ని కుటుం సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇప్పుడు పార్టీ పేరు మార్చ‌మ‌ని అంటే ఎలా.? ఎన్నికల సంఘానికి కవిత లేఖ
జులై 13న మీ పిల్ల‌ల‌కు ఈ ట్యాబ్లెట్స్ క‌చ్చితంగా వేయించండి.. ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోంది