నామా ఇల్లు, కార్యాలయాల్లో 17 గంటల పాటు ఈడీ సోదాలు: కీలక పత్రాలు సీజ్

By telugu team  |  First Published Jun 12, 2021, 9:09 AM IST

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంటిలోనూ, కార్యాలయంలోనూ ఈడీ అధికారులు సోదాలు ముగించారు. దాదాపు 17 గంటల పాటు ఈడి అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఇంటిలో, కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 17 గంటల పాటు సోదాలు నిర్వహించింది. ఆరు చోట్ల చోట్ల ఈడి అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈడీ సోదాలు ప్రారంభించి శనివారం తెల్లవారు జామున 2 గంటలకు ముగించింది. నామా నాగేశ్వర్ రావుకు చెందిన లాకర్ తెరుచుకోకపోవడంతో బయటి నుంచి వ్యక్తిని రప్పించి తెరిపించారు. అందులోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు 

Latest Videos

రూ.1064 కోట్ల బ్యాంక్ నిదుల మనీలాండరింగ్ కేసును ఈడి దర్యాప్తు చేస్తోది. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని ఇతర కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. 

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల మధుకాన్ కార్యాలయంలో, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఇంటిలో నామా నాగేశ్వర రావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్ ప్రెస్ వే సీఎండీ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. మధుకాన్ డైరెక్టర్లు ఎన్. సీతయ్య, పృథ్వీల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

నామా నాగేశ్వర రావు కంపెనీలపై సీబిఐ 2019లో కేసు నమోదు చేసింది. 2020లో రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ తో ాపటు డైరెక్టర్లపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను ఎక్స్ ప్రెస్ వేకు వినియోగించకుండా ఇతర కంపెనీలకు మళ్లించారని సిబిఐ ఆరోపించింది.

click me!