హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరో వ్యక్తిని మింగేసిన నాలా.. పెన్షన్ ఆఫీసు వద్ద విషాదం

Siva Kodati |  
Published : Aug 13, 2021, 07:59 PM IST
హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరో వ్యక్తిని మింగేసిన నాలా.. పెన్షన్ ఆఫీసు వద్ద విషాదం

సారాంశం

హయత్ నగర్ సర్కిల్ సాహెబ్ నగర్ మ్యాన్ హోల్ ప్రమాదం మరువక ముందే నాలాలో పడి మరో వ్యక్తి మృతిచెందడం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. పెన్షన్ ఆఫీసు వద్ద బల్కాపూర్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు

హైదరాబాద్ పెన్షన్ ఆఫీసు వద్ద దారుణం జరిగింది. బల్కాపూర్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నాలాకు రేలింగ్ లేకపోవడం, కనీసం ఫెన్సింగ్ కూడా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తాగిన మత్తులో సదరు వ్యక్తి నాలాలో పడి వుండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. నాలాలో పూడిక తీసేందుకు గాను నాలాకు వున్న రక్షణ గోడను తొలగించాడు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్. దీనిని పునర్నిర్మించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నాలాలో పడిన వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. ఇటీవల హయత్ నగర్ సర్కిల్ సాహెబ్ నగర్ మ్యాన్ హోల్ ప్రమాదం మరువక ముందే నాలాలో పడి మరో వ్యక్తి మృతిచెందడం నగరంలో కలకలం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!