భార్యను కొట్టబోయి.. మేడపై నుంచి జారి కిందపడి..

Published : Apr 12, 2021, 07:38 AM IST
భార్యను కొట్టబోయి.. మేడపై నుంచి జారి కిందపడి..

సారాంశం

కొత్తపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. కాగా.. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారిన ప్రసాద్.. తరచూ భార్యను వేధించేవాడు. శనివారం కూడా ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణంతో.. కుటుంబం వీధిన పడింది. మద్యం మత్తులో భార్యపై చెయ్యి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ క్రమంలో అదుపుతప్పి మేడపై నుంచి జారి కిందపడ్డాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రసాద్(34) తాపీమేస్త్రి గా పనులు చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య ఉషారాణి తో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. కొత్తపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. కాగా.. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారిన ప్రసాద్.. తరచూ భార్యను వేధించేవాడు. శనివారం కూడా ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

కోపంలో భార్యను కొట్టాలని అనుకున్నాడు. అనుకోకుండా తాముంటున్న రెండంతుస్తు నుంచి జారి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. కుటుంబానికి ప్రసాద్ మాత్రమే జీవనాధారం. అతను కూడా చనిపోవడంతో కుటుంబ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కనీసం భర్త శవాన్ని స్వగ్రామానికి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితిలోనే ఆమె ఉండటం గమనార్హం. దీంతో.. ప్రసాద్ మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. వారి పరిస్థితి చూసి చలించిపోయిన స్థానిక పోలీసులు వారికి చేతిలోకి రూ.500 ఇచ్చి.. పిల్లలకు భోజనం పెట్టారు. కాగా.. ప్రసాద్ మృతదేహం కోసం తల్లిదండ్రులు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం