లాక్‌డౌన్ వద్దు.. నా ఫేవరేట్ క్రికెటర్లు వారే: నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం

Siva Kodati |  
Published : Apr 11, 2021, 08:26 PM IST
లాక్‌డౌన్ వద్దు.. నా ఫేవరేట్ క్రికెటర్లు వారే: నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం

సారాంశం

లాక్‌డౌన్ మంచిది కాదని.. దానితో ఎంతో నష్టపోయామన్నారు మంత్రి కేటీఆర్. 2021లో లాక్‌డౌన్ వద్దనే కోరుకున్నామని ఆయన చెప్పారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు

లాక్‌డౌన్ మంచిది కాదని.. దానితో ఎంతో నష్టపోయామన్నారు మంత్రి కేటీఆర్. 2021లో లాక్‌డౌన్ వద్దనే కోరుకున్నామని ఆయన చెప్పారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.

ప్రజలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ట్విట్టర్‌లో సమాధానాలు ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు, హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్రం మద్ధతు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.

తనకు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ఫేవరేట్ క్రికెటర్లని చెప్పారు కేటీఆర్. ఆదివారం సాయంత్రం #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

చాలా మంది నెటిజన్లు కేటీఆర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. మరికొందరు వారి సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?