కరోనా టెస్టు చేయలంటూ పోలీస్ స్టేషన్ లో హల్ చల్

By telugu news teamFirst Published Jun 24, 2020, 1:47 PM IST
Highlights

దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ  నేపథ్యంలో.. ప్రజల్లో రోజు రోజుకీ భయం పెరిగిపోతోంది. ఈ భయంతోనే తమకు కరోనా పరీక్ష చేయండి అంటూ పలువురు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా.. తాజాగా ఓ వ్యక్తి తనకు కరోనా పరీక్ష చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద నానా హంగామా చేశాడు. ఈ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఒక మహిళ(62) కరోనా బారిన పడింది. కాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ కుమారుడు బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆందోళన చెందారు. తనకు కరోనా వచ్చిందని, టెస్టులు చేయడం లేదని ఆమె కుమారుడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హంగామా సృష్టించాడు.

 దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.

అయితే దీనిపై మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ..అనుమానితులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వస్తుండడంతో ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయించామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. బాధితులు ఎవరు వచ్చినా మాస్కులు ధరించి, శానిటైజ్‌ చేసుకున్నాకే లోపలికి రావాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. కామారెడ్డి జిల్లా లో కరోనా పంజా విసురుతోంది. ఒకే రోజు పది మంది పాజిటివ్‌ వచ్చింది. దీంతో కోవిడ్‌ కేసుల సంఖ్య 34కు చేరింది. ఇందులో 12 మంది రెండు నెలల క్రితమే కోలుకుని ఇంటికి చేరారు. 22 మంది చికిత్స పొందుతున్నారు.  జిల్లాకేంద్రం నుంచి ఆదివారం 24 మంది రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు మంగళవారం వచ్చాయి. ఆరు పాజిటివ్‌ రాగా.. 18 నెగెటివ్‌ వచ్చాయి.

 

click me!