నాపై దాడి చేశాడు: పీవీపీపై కైలాష్ పోలీసులకు ఫిర్యాదు

Published : Jun 24, 2020, 12:40 PM ISTUpdated : Jun 24, 2020, 04:41 PM IST
నాపై దాడి చేశాడు: పీవీపీపై కైలాష్ పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

 పీవీపీ మనుషులు తనపై దాడికి దిగారని  కైలాస్ విక్రమ్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం నాడు ఈ మేరకు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని ప్రసారం చేసింది. 

హైదరాబాద్: తనపై సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ మనుషులు దాడి చేశారని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14 లో భూ వివాదం విషయమై ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై ఇరువర్గాలను పోలీసులు విచారిస్తున్నారు. 

హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో   పీవీపీకి మరో వ్యక్తి  కైలాస్ విక్రమ్  వివాదం చోటు చేసుకొంది. పీవీపీ తనపై దాడి చేయించారని పోలీసులకు కైలాష్ విక్రమ్ ఫిర్యాదు చేశారు.

పీవీపీ మనుషులు తనపై దాడి చేశారని కైలాష్ చేస్తున్న ఆరోపణలను పీవీపీ కొట్టిపారేశారని ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వీరి మధ్య విబేధాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. తనపై దాడి చేశాడని పీవీపీపై కైలాష్ విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఇద్దరిని పోలీసులు విచారించినట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు
Smart Ration Card : ఇకపై ఏటిఎం, పాన్ కార్డుల్లాగే స్మార్ట్ రేషన్ కార్డు.. తెలంగాణలో పంపిణీకి ముహూర్తం ఖరారు