తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే కీలక అధికారులకు కరోనా సోకింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే కీలక అధికారులకు కరోనా సోకింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా సోకింది. దీంతో వారిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
undefined
also read:హైద్రాబాద్‌పై కరోనా పంజా: మరణాల్లో 80 శాతం ఇక్కడే
ఈ సమయంలోనే కీలకమైన అధికారులు కరోనా బారిన పడడం కొంత ఇబ్బందిగా మారింది. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులకు కూడ కరోనా లక్షణాలు ఉన్నాయని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.ఇంటర్ ఫలితాల్లో అనుమానాలు ఉన్నవారు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.