బంధువు భార్యతో సహజీవనం, ఒత్తిడితో వ్యక్తి ఆత్మహత్య..

Published : May 07, 2022, 10:09 AM IST
బంధువు భార్యతో సహజీవనం, ఒత్తిడితో వ్యక్తి ఆత్మహత్య..

సారాంశం

చుట్టాల వ్యక్తి భార్యతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి బంధువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది.   

హైదరాబాద్ : సమీప బంధువు భార్యతో Symbiosis చేస్తూ చుట్టాల నుంచి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి suicide చేసుకున్నాడు. బోయిన్ పల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత్ (37) రెండేళ్లుగా న్యూ బోయిన్ పల్లి బాపూజీనగర్ లో ఉంటూ ఓ Rehabilitation Centerలో పనిచేస్తున్నాడు. తన సమీప బంధువు wife (28)ను స్వగ్రామం నుంచి తీసుకొచ్చి బాపూజీనగర్ లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. 

గురువారం రాత్రి తమ్ముడు హరీంద్ర ఆకాశ్ తో కలిసి మద్యం తాగాడు. ఇంటికొచ్చి ఉక్కపోతగా ఉందని బంగ్లా మీదికి వెల్దామని సహజీవనం చేస్తున్న మహిళతో చెప్పాడు. ఆమె బయటకు వెళ్లగానే లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఆమె హరీంద్రకు ఫోన్ చేసింది. అతను వచ్చి వెంటిలేటర్ నుంచి చూసేసరికి సంజీత్ కిటికీకి ఉరేసుకుని కనిపించాడు. హరీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సహజీవన విషయమై బంధువుల ఒత్తిడి ఎక్కువవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తు్నారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల రెండో తేదీన ఒడిశాలో దారుణం జరిగింది.. తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు.  ఇంట్లో కళ్ళముందు ముగ్గురు చిన్నారులు కనిపించారు.  ఆవేశంతో ఊగిపోతున్న తండ్రిని చూసి బిక్కుబిక్కు మనడం తప్ప మరేమీ తెలియని 5 ఏళ్ల కుమార్తె,  తండ్రిని గుర్తు పట్టడం తప్ప పరిస్థితి అర్థం చేసుకోలేని రెండేళ్ల కుమారుడు.. తల్లి దగ్గర లేకపోవడంతో పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి.

ఆ స్థితిలో ఆ పసి వాళ్ళని చూసైనా ఆ కర్కశుడి మనసు కరగలేదు. కానీ, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2),  ఆరు నెలల చిన్నారిని  గొడ్డలితో నరికి చంపాడు.  

ఆ తర్వాత  deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి వారు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. చివరికి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.  కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండు ముండాను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu