ఒకే అమ్మాయిని ఇష్టపడ్డ ఇద్దరు .. కాలేజీలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్ధులు

Siva Kodati |  
Published : Jul 01, 2023, 03:42 PM IST
ఒకే అమ్మాయిని ఇష్టపడ్డ ఇద్దరు .. కాలేజీలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్ధులు

సారాంశం

హైదరాబాద్ నారాయణ గూడలో ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్ధుల మధ్య గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. విద్యార్ధులు ఘర్షణపడుతున్నా కాలేజ్ యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. 

హైదరాబాద్ నారాయణ గూడలో ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్ధుల మధ్య గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. ఓ అమ్మాయి కోసం రెండు వర్గాలు ఏకంగా కాలేజీ ఆవరణలోనే కొట్టుకున్నాయి. ఒకరు ప్రేమిస్తున్న అమ్మాయికి మరొకరు ప్రపోజ్ చేయడంతో వివాదం ముదిరింది. దీంతో శనివారం కాలేజ్ ఎదుటే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే విద్యార్ధులు ఘర్షణపడుతున్నా కాలేజ్ యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. మరోవైపు విద్యార్ధులు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!