టిక్ టాక్ మోజులో భార్య.. పట్టించుకోవడం లేదని భర్త ఏం చేశాడంటే...

Published : Jul 12, 2021, 09:36 AM IST
టిక్ టాక్ మోజులో భార్య.. పట్టించుకోవడం లేదని భర్త ఏం చేశాడంటే...

సారాంశం

 ఓ మహిళ కుటుంబాన్ని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మునిగి తేలడం మొదలుపెట్టింది. దీంతో.. భార్య పట్టించుకోవడం లేదని.. భర్త ఆత్మహత్య  చేసుకున్నాడు. 

ప్రస్తుత కాలంలో..చాలా మంది సోషల్ మీడియాకు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. ఈ క్రమంలో కనీసం కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం లేదు.  తాజాగా.. ఓ మహిళ కుటుంబాన్ని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మునిగి తేలడం మొదలుపెట్టింది. దీంతో.. భార్య పట్టించుకోవడం లేదని.. భర్త ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన  సనత్ నగర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి.

సనత్ నగర్ కి చెందిన పవన్ నీమ్కార్, ప్రియాంక దంపతులకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. కాగా.. ప్రియాంక.. ఇటీవల సోషల్ మీడియాకు బానిసగా మారింది. ప్రతిరోజూ టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ప్రియాంక మొత్తంగా సోషల్ మీడియాకే పరిమితమైపో సాగింది. ఇది గమనించిన భర్త పవన్.. ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రియాంక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్.. ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లిఖిత పూర్వక ఫిర్యాదు పోలీసు స్టేషన్‌లో సమర్పించారు. 


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే