వీడు మహా ‘మాయ’లోడు.. ఆరేళ్లలో వెయ్యికి పైగా మహిళలకు వల.. రూ.40కోట్లు స్వాహా...

By SumaBala BukkaFirst Published Jul 21, 2022, 7:16 AM IST
Highlights

ఓ వ్యక్తి ఆరేళ్లలో వెయ్యిమందికి పైగా మహిళల్ని మోసం చేసి వారి నుంచి రూ.40కోట్ల మేర స్వాహా చేశాడు. మాట్రిమోనిలో రెండో పెళ్లి కోసం చూస్తున్న యువతులు, మహిళలే టార్గెట్ లుగా ఫేక్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లతో కథ నడిపించాడు. 

హైదరాబాద్ : మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ గురించి అనేక విషయాలు విని ఉంటాం. కానీ ఇది అన్నింటిలోకి హైలెట్. ఆరేళ్లలో వెయ్యినుంచి 1500మంది మహిళలకు గాలం వేశాడంటే వాడు మామూలు మోసగాడు కాదు. అమాయకమైన మొహంతో, అందమైన మాటలతో.. సేవా అనే ముసుగుతో అమ్మాయిల్ని వలలో వేసుకుని దాదాపు 40 కోట్ల మేర నగదు కొట్టేశాడంటే... వాటి కిలాడీ వేశాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెడితే...

ఆన్లైన్ వివాహ పరిచయ వేదికల్లో రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళలను మోసగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావు పేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ (31)  మోసాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని బయటికి వచ్చాయి. బీటెక్ చేసిన అతడు ఉద్యోగం వెతుక్కుంటూ ఆరేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ కూకట్పల్లిలో మకాం వేశాడు. ఈ ఆరేళ్ల వ్యవధిలో సుమారు 1,000 నుంచి 1500 మంది యువతులను, మహిళలను మోసగించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారి నుంచి రూ. నలభై నుంచి యాభై కోట్లు వరకు కొట్టేసినట్లు అంచనా వేస్తున్నారు. 

తండ్రిని చంపినందుకు ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ , జవహర్‌నగర్ రియల్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

అతడికి  హర్ష, హర్షవర్ధన్, చెరుకూరి హర్ష అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. గత మే నెలలో వంశీకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 2014లో హైదరాబాద్ కు వచ్చిన వంశీకృష్ణ మొదట కూకట్పల్లిలోని ఒక హోటల్లో పనిచేసేవాడు. 2015లో క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటుపడ్డాడు.  2016లో జాబ్ కన్సల్టెన్సీ/ట్రావెల్ ఆఫీస్ లో చేరాడు.  10 మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన కేసులో అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక.. మాధురి చౌకి, గాయత్రి,  శ్వేత,  సాత్విక- జెస్సీ, హర్ష కూల్ 94.. పేర్లతో ఇంస్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు తెరిచాడు.  

మహిళలు, యువతులకు తనకు తాను యువతిగా పరిచయం చేసుకునే వాడు. సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాడంటూ  మారుపేర్లతో ఉన్న ఖాతాల నుంచి తనపై తానే పొగడ్తల వర్షం కురిపించుకొనేవాడు. ఇది నిజమని 1000 నుంచి 1500 మంది మహిళలు యువతులను నమ్మించాడు. ఉద్యోగం, ఉపాధి, సేవా కార్యక్రమాలు అంటూ ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో గుంజేవాడు. పరిచయమైన  అమ్మాయిలు, మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిస్తే వారికి వెంటనే ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉదారంగా ఇచ్చేవాడు.  

దీంతో అతడు గురించి ఆ మహిళలు, యువతులే.. ప్రచారం చేసేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో ఇంత మందిని మోసం చేయగలిగాడని అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడు బ్యాంకు ఖాతాలోని సుమారు నాలుగు కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు. రిమాండ్లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.

click me!