24 గంటల్లో 255 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,63,282కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 18, 2021, 08:43 PM IST
24 గంటల్లో 255 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,63,282కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 329 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,148 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 52,244 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,63,282కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 3,903కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 329 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 70, జగిత్యాల 6, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 20, ఖమ్మం 22, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 14, ములుగు 1, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 13, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 12, సిరిసిల్ల 5, రంగారెడ్డి 16, సిద్దిపేట 8, సంగారెడ్డి 3, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 5, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్
రాములోరి కళ్యాణం వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Asianet News Telugu