వికారాబాద్ లో అమానుషం ... కన్నతండ్రిని బండరాయితో కొట్టిచంపిన కసాయి కొడుకు

Published : Mar 30, 2023, 11:35 AM IST
వికారాబాద్ లో అమానుషం ... కన్నతండ్రిని బండరాయితో కొట్టిచంపిన కసాయి కొడుకు

సారాంశం

కాసులకు కక్కుర్తిపడి కన్న తండ్రిని బండరాయితో బాది అతి కిరాతకంగా చంపాడో కసాయి కొడుకు. ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వికారాబాద్ : ఆపత్కాలంలో అవసరపడతాయని భీమా చేస్తుంటారు... కానీ ఈ భీమాయే ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. భీమా డబ్బుల కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని అతి కిరాతకంగా హతమార్చిన అమానుష ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కన్న తండ్రిని బండరాయితో మోది చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు కసాయి కొడుకు.  

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బిక్యానాయక్ తండాకు చెందిన  శ్రీనివాస్ ఓ బీమా సంస్థలో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి ధన్ సింగ్(68) పేరిట రూ.50లక్షల బీమా చేయించాడు. ఈ బీమా డబ్బుల కోసం ఆశపడ్డ అతడు కన్న తండ్రిని అతి కిరాతకంగా చంపాడు. కానీ అందరినీ బైక్ ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. 

గత మంగళవారం తండ్రి ధన్ సింగ్ ను తీసుకుని బైక్ పై తాండూరుకు బయలుదేరాడు శ్రీనివాస్. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి తండ్రిని తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా బండరాయితో తలపై మోది హతమార్చాడు. ప్రాణాలు పోయాక తండ్రి మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి పడేసి బైక్ ను కూడా ధ్వంసం చేసాడు. బైక్ యాక్సిడెంట్ కు గురయి తండ్రి కిందపడిపోయాడని... తీవ్రంగా గాయపడి మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. వారుకూడా నిజంగానే యాక్సిడెంట్ లో చనిపోయాడని భావించారు. 

Read More  షాకింగ్.. వెంటపడి వేధించిన వ్యక్తిని చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి చంపేసిన యువతి..

అయితే శ్రీనివాస్ కు చిన్న గాయం కూడా కాకపోవడం సోదరుడు రవికుమార్ లో అనుమానం రేకెత్తించింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు శ్రీనివాస్ ను తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. బీమా డబ్బుల కోసమే తండ్రిని చంపినట్లు శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా డబ్బుల కోసం కన్నతండ్రిని చంపిన కసాయి కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

 ఇదిలావుంటే భూ తగాదాల నేపథ్యంలో సొంత పెదనాన్నను ఓ యువకుడు అతికిరాతకంగా హతమార్చిన ఘటన ఇటీవల సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుంది. పెదనాన్న తల నరికిన యువకుడు దాన్ని వెంటపెట్టుకుని తిరుగుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించాడు. చివరకు అతడే నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

జహిరాబాద్ సమీపంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య, రత్నం అన్నదమ్ములు. వీరి మధ్య వ్యవసాయ భూమి పంపకం విషయంలో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నారు. అయితే రత్నం కొడుకు రాకేష్ తమకు అన్యాయం చేస్తున్నది పెదనాన్నే అని భావించి కోపం పెంచుకుని చివరకు దారుణానికి ఒడిగట్టాడు. చంద్రయ్య పొలం నుండి వస్తుండగా అడ్డుకున్న రాకేష్ పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. చంద్రయ్య తలను శరీరం నుండి వేరుచేసి దాన్ని పట్టుకుని ఊరంతా తిరుగుతూ వీడియోలు తీసుకున్నాడు. పెదనాన్నను ఎందుకు చంపాడో వివరిస్తూ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు నిందితుడు రాకేష్. ఈ దారుణం జహిరాబాద్ నియోజకవర్గంలో కలకలం  రేపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్