కత్తిపీట వేడిచేసి కాల్చి... సహజీవనం చేస్తున్న మహిళ దారుణ హత్య..

By SumaBala Bukka  |  First Published Jul 5, 2022, 8:14 AM IST

మద్యం మత్తులో తనతో సహజీవనం చేస్తున్న మహిళను చిత్రహింసలు పెట్టి హతమార్చాడో వ్యక్తి. ఆ తరువాత ఆమెను చంపేశానంటూ అరుస్తూ వీధుల్లో వీరంగం వేశాడు. 


వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తనను నమ్ముకుని వచ్చిన ఓ మహిళను కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక ఎస్ఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన పున్నం వెంకన్నకు.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి  మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన మంజుల (45)తో పదిహేనేళ్ళ కిందట పరిచయం ఏర్పడింది. వీరికి  హైదరాబాదు లింగంపల్లిలోని ఓ వృద్ధాశ్రమంలో  పరిచయం అయ్యింది. అక్కడే వీరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది.  అలా ఇద్దరూ సహజీవనం చేస్తూ అక్కడే పని చేసుకుంటూ ఉంటున్నారు.

ఆదివారం ఉదయం వీరిద్దరు స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత ఏదో విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గొడవ పడడం మొదలుపెట్టారు. ఇది చూసిన స్థానికులు సర్ధిచెప్పారు. రాత్రి సమయంలో మరోసారి గొడవ పడుతుండగా వెంకన్న మద్యం మత్తులో కత్తిపీటను గ్యాస్ స్టవ్ మీద వేడిచేసి.. మంజుల చేతులపై కాల్చాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు. ఆ తర్వాత  ఆమెను చంపేశాను అంటూ వదురుతూ.. సోమవారం తెల్లవారుజామున  అరుస్తూ.. వీధుల్లో  తిరిగాడు. మద్యం మత్తులో ఊగిపోతున్న అతడిని స్థానికులు  గమనించగా విషయం తెలిసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

Latest Videos

undefined

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. పెళ్లి మండపంలో ఆత్మహత్య చేసుకున్న వధువు ప్రియుడు..

మృతురాలు మంజులకు 22 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పుట్టాక భర్తతో  విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వెంకన్నతో పరిచయమైంది. అది సహజీవనానికి దారితీసింది. చివరికి ఆ పరిచయమే ఆమెను  అనంత లోకాలకు పంపించింది. ఇక వెంకన్న మొదటి భార్యను ఇలాగే అతి క్రూరంగా హత్య చేసి జైలుకు వెళ్లాడు. వచ్చిన తర్వాత మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అతడి ఆకృత్యాలు తట్టుకోలేక ఆ మహిళ కూడా వదిలి వెళ్ళిపోయింది. ఆ తరువాత మంజులతో  సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు ఆమెను అత్యంత దారుణంగా  హతమార్చాడు. మృతురాలి కుమారుడు మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

click me!