Peddapally Crime News: మ్యాట్రిమోనిలో ఫేక్ అకౌంట్లు.. ల‌క్ష‌లాది రూపాయాల‌ను కాజేసిన కేటుగాని అరెస్ట్ 

By Rajesh KFirst Published Jul 5, 2022, 1:56 AM IST
Highlights

Peddapally Crime News: మ్యాట్రిమోనిలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని హ‌నీట్రాఫిక్ పాల్పడుతున్న ఓ వ్య‌క్తిని పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి పోలీసులు చాకచక్కగా పట్టుకున్నారు. అమ్మాయిలా న‌టిస్తూ.. అబ్బాయిల‌తో ద‌గ్గ‌ర‌వుతారు. ఆపదలో ఉన్నానంటూ.. ఆర్థికంగా సాయం చేయాలంటూ.. లక్షల రూపాయాల‌ను కాజేసిన కాకినాడకు చెందిన సూర్య ప్రకాష్ ను పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి పోలీసులు అరెస్టు చేశారు. 
 

Peddapally Crime News: దేశ‌వ్యాప్తంగా సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మ‌నీ కోసం.. యువ‌త అడ్డ‌దారులు తొక్కుతున్నారు. అమాయ‌కులు జీవితాల‌తో ఆడుకుంటున్నారు. ల‌క్షలాది రూపాయాల‌ను కాజేస్తున్నారు. ఇటీవ‌ల మ్యాట్రిమోనీ ట్రాఫిక్ చేస్తూ.. ల‌క్ష‌ల రూపాయాల‌ను దోచుకున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని.. అమ్మాయిలా న‌టిస్తూ.. అబ్బాయిల‌తో స్నేహం, ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌వుతారు. ఆపదలో ఉన్నానంటూ.. ఆర్థికంగా సాయం చేయాలని లక్షలు వసూలు చేసిన కేటుగాన్ని పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి పోలీసులు చాకచక్కగా పట్టుకున్నారు. 

కాకినాడకు చెందిన సూర్య ప్రకాష్ జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుండే వాడని పెద్దపల్లి డిసిపి అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో మౌనిక అనే యువతిని ప్రేమించి.. ఆమెతో గోవాకు వెళ్లి  గ్యాంబ్లింగ్ గేమ్ ఆడేవాడని ఆయన పేర్కొన్నారు. ఇలా ఇష్టానుసారంగా జ‌ల్సాలు, జూదాల‌కు అల‌వాటు ప‌డ్డ సూర్య‌ప్ర‌కాశ్ వ్యాపారంలో తీవ్రంగా న‌ష్ట‌పోయారు. పీకల దాకా.. అప్పుల పాలు కావ‌డంతో హైదరాబాద్ కు మకాం మార్చాడన్నారు. 

ఈ క్ర‌మంలో ఈజీ మనీ కోసం మ్యాట్రిమోనీ చేయ‌డం ప్రారభించాడనీ,  ఆడ‌వారి పేర్లతో ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసి పెళ్లి చేసుకుంటానట్టు అమాయకుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడన్నారు.

 గోదావరిఖనికి చెందిన సురేష్ అనే వ్యక్తి సూర్య ప్రకాష్ వలలో పడి 8 లక్షల రూపాయలు అకౌంట్ కు పంపించాడని... పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ ఎన్టిపిసి పోలీసులను ఆశ్రయించాడన్నారు. 

మరికొన్ని డబ్బులు కావాలంటూ సూర్యప్రకాష్ ఫోన్ చేయడంతో అవకాశాన్ని అదునుగా తీసుకొని పోలీసులు సూర్య ప్రకాష్ ను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడు నుండి రెండు సెల్ ఫోన్లతో పాటు 14 లక్షల రూపాయలను రికవరీ చేసినట్టు అఖిల్ మహాజన్ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి బాధితులకు న్యాయం చేస్తామని డిసిపి హామీ ఇచ్చారు. అమాయకులను ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్నారని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

click me!