భార్య లీగల్ నోటీసులు పంపిందని.. వ్యక్తి ఆత్మహత్య..

Published : Jan 22, 2022, 11:09 AM IST
భార్య లీగల్ నోటీసులు పంపిందని..  వ్యక్తి ఆత్మహత్య..

సారాంశం

మనస్తాపం చెందిన శ్రావణ్ కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటివారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్ :  wifeతో గొడవలు, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి suicide చేసుకున్నాడు. మీర్ పేట ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ కు చెందిన శ్రీరాములు శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్ పేట్ లోని లక్ష్మీ దుర్గ కాలనీలో స్థిరపడ్డాడు. 2019లో జనగామకు చెందిన రవళి (26)తో అతడికి marriage అయింది. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా  దంపతులు తరచూ conflicts పడుతున్నారు.

ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో husbandతో గొడవపడి కుమార్తెను తీసుకుని  పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రావణ్ కుమార్ మానసికంగా కుంగిపోయి liquorకి బానిసయ్యాడు. అప్పుడు పెరగడంతో లక్ష్మీ దుర్గ కాలనీలోని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న రవళి అందులో తనకు వాటా ఉందని. వాటా తేలేవరకూ ఇల్లు అమ్మకానికి పెట్టొద్దని Legal noticeలు పంపించింది.

దాంతో మనస్తాపం చెందిన శ్రావణ్ కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటివారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 

ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో లక్నో లో జరిగింది. కలకాలం కలిసి ముందడుగేయాలని, చిరకాలం కలిసే ఉంటామని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. ఏడు జన్మలూ కలిసి ఉంటామని అనుకున్నారు. వేద మంత్రాల నడుమ అగ్ని సాక్షి ఒక్కటయ్యారు. సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఓ భేదాభిప్రాయం. మనసు ముక్కలైంది. అంతటితో ఆగలేదు.. వేధింపుల వరకు పరిస్థితులు దిగజారాయి. కలలు కన్న జీవితం ఒక్కసారిగా తలకిందులు కావడంతో ఓ నూతన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వారమైనా గడవలేదు.. అప్పుడే లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

షామ్లీ జిల్లా చూస్నా గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. బాబ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ నవ వరుడు విష పదార్థాలు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నూతన వరుడి సోదరి సీమా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వార్త వెలుగులోకి వచ్చింది. వరుడు ప్రయాస్.. వధువు కోమల్  ఈ నెల 14వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. కానీ, వారం నిండక ముందే వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రయాస్‌ను ఆయన భార్య కోమల్, ఆమె సోదరుడు దూషించారని, ఈ దూషణలు, వేధింపులతో తన సోదరుడు మనస్థాపానికి గురయ్యాడని ఫిర్యాదులో సీమా వివరించారు. ఆ మనస్థాపంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, ఇదే జిల్లా షామ్లీలో నవంబర్ లోనే ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 55 ఏళ్ల మదన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్యాన మంజ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగానే స్థానికులు వెంటనే స్పందించి హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే మదన్ కుమార్ మరణించాడని వైద్యులు చెప్పినట్టు చర్తవాల్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. వారి కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. ఈ ఘటనతో గ్యాన మంజ్రా గ్రామంలో విషాదం నెలకొంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!