కాళ్లు మొక్కించుకుని, మహిళలతో అసభ్య ప్రవర్తన

sivanagaprasad kodati |  
Published : Nov 14, 2018, 10:10 AM ISTUpdated : Nov 14, 2018, 10:11 AM IST
కాళ్లు మొక్కించుకుని, మహిళలతో అసభ్య ప్రవర్తన

సారాంశం

తమ ముందు కారు హారన్‌ మోగించారన్న కోపంతో ఓ వ్యక్తి అనుచరులతో కలిసి నానా రచ్చ చేశాడు. దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రసాద్ గౌడ్ సోమవారం అర్థరాత్రి 12.30 ప్రాంతంలో తన కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు

తమ ముందు కారు హారన్‌ మోగించారన్న కోపంతో ఓ వ్యక్తి అనుచరులతో కలిసి నానా రచ్చ చేశాడు. దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రసాద్ గౌడ్ సోమవారం అర్థరాత్రి 12.30 ప్రాంతంలో తన కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు.

ఈ క్రమంలో కీసరకు చెందిన కందాడి స్కైలాబ్‌రెడ్డి లక్ష్మీనగర్‌లోనే ఉంటున్న తన బంధువు ఇంటికి వచ్చాడు. ప్రసాద్ గౌడ్ కారు వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న స్కైలాబ్ రెడ్డి...పావుగంట తర్వాత తన 8 మంది అనుచరులతో కలిసి ప్రసాద్ గౌండ్ ఇంటికి వెళ్లాడు..

గేటును కోపంతో తన్ని ఇంట్లోకి చొరబడి... ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ప్రసాద్ ఇదేమిటని ప్రశ్నించగా.. నా ముందే కారు హారన్ మోగిస్తావా అంటూ అతనితో పాటు తల్లిదండ్రులను బెదిరిస్తూ దాడి చేశారు స్కైలాబ్ రెడ్డి. అక్కడే ఉన్న ప్రసాద్ గౌడ్ సోదరి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఇంట్లోని కుటుంబసభ్యులందరినీ బెదిరించి వారితో కాళ్లు మొక్కించుకున్నారు. వెళుతూ వెళుతూ బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. జరిగిన సంఘటనపై బాధితులు అర్థరాత్రి 100కు ఫోన్ చేసి ఘటనపై సమాచారం అందించారు. అనంతరం నిన్న జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం