మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే బాణసంచా నిర్వహకుడిపై దాడి

Published : Oct 06, 2022, 11:49 AM IST
మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే బాణసంచా నిర్వహకుడిపై దాడి

సారాంశం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే బాణసంచా నిర్వహకుడిపై దాడి చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే బాణసంచా నిర్వహకుడిపై దాడి చేశారు. వివరాలు.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా జెడ్పీ మైదానంలో దసరా వేడుకలను నిర్వహించారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తుండగానే.. బాణసంచా కాల్చడం ప్రారంభం అయింది. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడిని వేదికపైకి రావాలని పిలిచారు. బాణసంచా నిర్వహకుడు అక్కడికి రాగానే టీఆర్ఎస్ నాయకులు అతడిపై దాడికి దిగారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో అతడిపై దాడి చేశారు. 

ఎవరూ చెబితే కాల్చవంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఓ వ్యక్తిపై దాడి జరుగుతున్న వారు పట్టించుకోకపోవడం.. ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్