టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు: సీఈసీకి తీర్మానం అందజేత

By narsimha lode  |  First Published Oct 6, 2022, 11:18 AM IST

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్  గా మారుస్తూ చేసిన  తీర్మానం కాపీని ఆ పార్టీ నేతలు  గురువారంనాడు  సీఈసీకి అందించారు.


హైదరాబాద్:టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానం కాపీని గురువారం నాడు సీఈసీకి అందించారు ఆ పార్టీ నేతలు.భారత రాష్ట్ర సమితిగా పేరు నమోదుచేయాలని సీఈసీకి నేతలు ధరఖాస్తు అందించారు. 

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈ నెల 5వ తేదీన  పార్టీ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని బీఆర్ఎస్ నేతలు మాజీఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీశ్రీనివాస్  రెడ్డిలు నిన్న సాయంత్రమే హైద్రాబాద్ నుండి ఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం సీఈసీ అధికారులతో సమావేశమయ్యారు. నిన్న  హైద్రాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం చేసిన తీర్మానం కాపీని ఎన్నికల సంఘం అధికారులకు అందించారు. 

Latest Videos

undefined

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ను ఇతర  రాష్ట్రాల్లో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. దరిమిలా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో 283 మంది ప్రతినిధులుపాల్గొన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ సమావేశానికి జేడీఎస్ నేత  కుమారస్వామి, తమిళనాడు వీఎల్ సీ నేత తిరుమలవలన్ కూడ హజరయ్యారు.  ఈ తీర్మానం కాపీని కేసీఆర్ చదివి విన్పించారు. మధ్యాహ్నం 1:19 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ తీర్మానం కాపీపై సంతకం చేశారు. ఈతీర్మానం కాపీని తీసుకుని బోయినపల్లి వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిలు నిన్న సాయంత్రం ఢిల్లీకి  బయలు దేరారు. ఇవాళ  మధ్యాహ్నం సీఈసీని కలిసి తీర్మానం ప్రతిని అందించారు. 

alsoread:టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం: ఈసీని కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

దేశంలోని రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలు ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర నుండి కేసీఆర్ తన పర్యటనలు ప్రారంభించనున్నారు. తెలంగాణ మోడల్ ను దేశంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయనున్నారు. తమ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న  నేతలతో కలిసి ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా   చేసిన తీర్మానంపై ఈసీ నిర్ణయం తీసుకోవడానికి కనీసం నెల రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది.అన్నీ అనుకున్నట్టుగా సాగితే  పేరు మార్పునకు సంబంధించి ఈసీ గెజిట్ విడుదల చేయనుంది.ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే  న్యాయపోరాటానికి కూడా  సిద్దమని కూడ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశంలోని రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలు ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర నుండి కేసీఆర్ తన పర్యటనలు ప్రారంభించనున్నారు. తెలంగాణ మోడల్ ను దేశంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయనున్నారు. తమ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న  నేతలతో కలిసి ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు  చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

click me!