కట్టుకున్న భార్యను కత్తితో గొంతుకోసి...ఇంటికి తాళంవేసి వెళ్లిన భర్త.. !

Published : Jul 09, 2021, 09:28 AM IST
కట్టుకున్న భార్యను కత్తితో గొంతుకోసి...ఇంటికి తాళంవేసి వెళ్లిన భర్త.. !

సారాంశం

. గత కొద్ది రోజులుగా ఆమె మీద అనుమానం పెంచుుకున్న అతను గురువారం ఉదయం కత్తితో గొంతుకోసి హతమార్చాడు. ఆ కత్తిని ఆమె చేతిలో పెట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

భూపాలపల్లి : కంటికి రెప్పలా చూసుకుంటానని మూడు ముళ్లు వేశాడు. ఏడాది గడవక ముందే కాలయముడయ్యాడు. భార్య గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన భూపాలపల్లిలోని హనుమాన్ నగర్ లో గురువారం చోటు చేసుకుంది. 

సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. కాటారం మండలం రుద్రారానికి చెందిన రాగిణి(20ని భూపాలపల్లిలోని హరిశంకర్ కు ఇచ్చి గతేడాది నవంబరులో పెళ్లి చేశారు. హరిశంకర్ పాన్ షాపులకు సామాగ్రిని సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత నెలలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 

ఈ క్రమంలో ఆమె మీద వేడి టీ పోశాడు. తల్లిదండ్రులు వచ్చి కూతురును తీసుకెళ్లారు. బుధవారం రుద్రారం వెళ్లిన శంకర్, తన భార్యను మంచిగా చూసుకుంటానని, ఇబ్బంది పెట్టనని అత్తామామలకు చెప్పాడు. 

వారు నమ్మి కూతుర్ని పంపించారు. గత కొద్ది రోజులుగా ఆమె మీద అనుమానం పెంచుుకున్న అతను గురువారం ఉదయం కత్తితో గొంతుకోసి హతమార్చాడు. ఆ కత్తిని ఆమె చేతిలో పెట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఉదయం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో, చుట్టు పక్కల వారు లోపలికి వెళ్లి చూశారు. 

అక్కడ రాగిణి మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu