తెలంగాణ: కొత్తగా 731 మందికి పాజిటివ్.. నారాయణ పేటలో అత్యల్పం

Siva Kodati |  
Published : Jul 08, 2021, 10:24 PM ISTUpdated : Jul 08, 2021, 10:26 PM IST
తెలంగాణ: కొత్తగా 731 మందికి పాజిటివ్.. నారాయణ పేటలో అత్యల్పం

సారాంశం

తెలంగాణలో కొత్తగా 731 కరోనా కేసులు నమోదయ్యాయి. 993 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో 3,714 మంది కోవిడ్‌తో మృతి చెందారు

తెలంగాణలో కరోనా నిదానించింది. గడచిన 24 గంటల్లో 1,02,761 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 731 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 64, నల్గొండ జిల్లాలో 56 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 993 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో 3,714 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,29,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,14,865 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,206 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 27, జీహెచ్ఎంసీ 80, జగిత్యాల 17, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 13, గద్వాల 4, కామారెడ్డి 3, కరీంనగర్ 46, ఖమ్మం 64, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 11, మహబూబాబాద్ 26, మంచిర్యాల 44, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 13, నాగర్ కర్నూల్ 9, నల్గగొండ 56, నారాయణపేట 2, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 39, సిరిసిల్ల 21, రంగారెడ్డి 37, సిద్దిపేట 22, సంగారెడ్డి 10, సూర్యాపేట 26, వికారాబాద్ 5, వనపర్తి 10, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 46, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.
మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌