పెళ్లైన రెండు వారాలకే.. భార్యను, అత్తను కడతేర్చిన అల్లుడు.. కారణం ఏంటంటే..

Published : Mar 15, 2023, 08:09 AM IST
పెళ్లైన రెండు వారాలకే.. భార్యను, అత్తను కడతేర్చిన అల్లుడు.. కారణం ఏంటంటే..

సారాంశం

పెళ్లైన రెండు వారాలకే భార్య మీద అనుమానం పెంచుకున్నాడో భర్త. దీంతో అత్యంత దారుణంగా వ్యవహరించాడు. కూరగాయలు కోసే కత్తితో.. భార్య, అత్తమీద దాడిచేసి హత్య చేశాడు. 

వనపర్తి : అనుమానం పెనుభూతమై.. కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో మొదలుపెట్టాల్సిన ఆ యువతి జీవితాన్ని అంతం చేసింది. ఆమెతో పాటు కూతురు కాపురాన్ని చూసి సంతోషపడాలనుకున్న ఆ తల్లి ఊపిరి కూడా తీసింది. పెళ్లైన రెండు వారాలకే భార్యను, అత్తను అతి దారుణంగా చంపేశాడో అల్లుడు. భార్యమీద అనుమానమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన ఇటు తెలంగాణలోని వనపర్తిలోనూ.. అటు ఏపీలోని కర్నూలులోనూ కలకలం సృష్టించింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్లో ఆందోళనను కలిగించింది.

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటి గుమ్మానికి కఠిన పచ్చని తోరణాలు వాడకముందే..  కొత్తగా పెళ్లయిన మురిపం తీరకముందే.. కొత్త పెళ్లి కూతురికి భర్త,  అత్తింటి వ్యవహారం ఆకలింపు కాకముందే.. అత్యంత కర్కషంగా  హతమార్చాడు ఆ భర్త. పెళ్లైన రెండు వారాలకే.. భార్యను, అత్తను అనుమానంతో చంపేశాడు ఓ యువకుడు. అడ్డు వచ్చిన మామ మీద కూడా దాడి చేశాడు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపింది.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు.. ఈ మేరకు వివరాలు తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి సిట్, ఎవరిని వదిలేది లేదన్న ఏఆర్ శ్రీనివాస్

వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి (45).. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉండే దంపతులు. వీరికి రుక్మిణి (21) అనే కుమార్తె ఉంది. ఆమెను ఈ నెల 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన శ్రావణ్ కు ఇచ్చి వివాహం చేశారు. కొత్తగా పెళ్లయిన జంట.. ముచ్చటగా గడపకుండా.. రోజుల వ్యవధిలోనే వారిమధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 13 రోజుల్లోనే వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకు వెళ్లడానికి  వనపర్తికి వచ్చాడు శ్రావణ్. ఆ తర్వాత భార్య రుక్మిణితో పాటు..ఆమె తల్లిదండ్రులు రమాదేవి, వెంకటేశ్వర్లను కూడా తీసుకుని మంగళవారం నాడు కర్నూలుకు వచ్చాడు. పట్టణంలోని చింతల మునినగర్ లో శ్రవణ్ కు ఇల్లు ఉంది. తన ఇంటికి తీసుకువెళ్లిన శ్రవణ్ కొద్దిసేపటికే.. కూరగాయలు కోసే కత్తితో భార్య, అత్తల మీద దాడికి దిగాడు. 

కాపులు పూనుకోకుంటే ఏపీలో మళ్లీ అరాచకమే.. నా కులమే నన్ను నమ్మలేదు, ఒంటరినయ్యా : పవన్ వ్యాఖ్యలు

ఈ హఠాత్పరిణామానికి షాక్ కు గురైన జ్యోతి, రుక్మిణిలు తీవ్ర గాయాలతో.. రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడిని అడ్డుకోబోయిన మామ వెంకటేశ్వర్లు మీద కూడా అల్లుడు దాడికి దిగాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గలాటాకు అక్కడ చేరిన చుట్టుపక్కల వారు స్పందించి వెంటనే వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే  ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భార్య మీద అనుమానంతో పెళ్లైన రెండు వారాలకే శ్రవణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu