తెలంగాణ సీఎంవో ముఖ్యకార్యదర్శి లేఖ ఫోర్జరీ: కేటుగాడి అరెస్ట్

By Siva KodatiFirst Published Oct 6, 2019, 10:53 AM IST
Highlights

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా జీవో కాపీని సృష్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా జీవో కాపీని సృష్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రామంతాపూర్‌కు చెందిన మహ్మద్  షఫీక్ అహ్మద్.. సీఎంవో ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్ హెడ్ తయారు చేశాడు.

దాని సాయంతో రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ఓ ప్రభుత్వ  భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన  నకిలీ ఆర్డర్‌ కాపీని సృష్టించాడు. అయితే ఆ స్థల యజమాని అర్జున్‌సింగ్ ఫిర్యాదుతో అహ్మద్ మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు శనివారం కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ హెడ్మాస్టర్ వ్యవహారం కలకలం రేగిన సంగతి తెలిసిందే.

నల్గొండ జిల్లా రావులపెంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మానవత్ మంగళ... కో ఆర్డినేటర్ పోస్ట్ కోసం మంత్రికేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ లెటర్ హెడ్‌ సృష్టించి కొంతకాలంగా ఆ పోస్టులో  కొనసాగుతున్నారు. అయితే ఫోర్జరీని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 
 

click me!