బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాష్: జైల్లోనే దసరా పండుగ

Published : Oct 05, 2019, 11:04 PM ISTUpdated : Oct 26, 2019, 09:02 AM IST
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాష్: జైల్లోనే దసరా పండుగ

సారాంశం

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకున్నారు. ఆ పిటీషన్ ను ఈ నెల 9వ తేదీన వింటామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో రవిప్రకాష్ దసరా పండుగ చంచల్ గుడా జైల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది.

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషిన్ ను ఈ నెల 9వ తేదీన వింటామని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రవిప్రకాష్ దసరా పండుగ రోజు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

రవిప్రకాష్ ను హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను సీతాఫల్ మండిలోని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో రవిప్రకాష్ ను పోలీసులు చంచల్ గుడా జైలుకు తరలించారు. 

రవిప్రకాష్ ను తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్టును డీసీపి సుమతి ధ్రువీకరించారు. టీవీ9లో నిధుల కైంకర్యంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ సొమ్మును రవిప్రకాష్ సొంతానికి వాడుకున్నారని సుమతి చెప్పారు.  

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలను తొలగించాలంటూ రవి ప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 

పోలీస్ స్టేషన్ కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. కాగా ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. 

టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu