టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా

Published : Oct 06, 2019, 08:33 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా

సారాంశం

టీఎంయు బాధ్యతల నుంచి తప్పుకోవాలని హరీశ్ భావించి రాజీనామా చేశారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఆర్టీసీ టీఎంయు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డికి పంపించారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా టీఎంయును స్థాపించారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్ రావు టీఎంయు బాధ్యతలు స్వీకరించారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతరత్రా అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున, ఆర్టీసీ కార్మిక యూనియన్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలోనే టీఎంయు బాధ్యతల నుంచి తప్పుకోవాలని హరీశ్ భావించి రాజీనామా చేశారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్