కారణమిదీ: హైద్రాబాద్‌లో భార్య, కొడుకుపై తుపాకీతో కాల్పులు

Published : Mar 09, 2021, 11:29 AM IST
కారణమిదీ: హైద్రాబాద్‌లో భార్య, కొడుకుపై తుపాకీతో కాల్పులు

సారాంశం

 కుటుంబ కలహాల నేపథ్యంలో తుపాకీతో భార్య,కొడుకుపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు బాదితులు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో తుపాకీతో భార్య,కొడుకుపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు బాదితులు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

హైద్రాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ కు చెందిన బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన హబీబ్‌నగర్ కు చెందిన హబీబ్ హష్మీ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఆయన చెడు వ్యసనాలకు బానిసనగా మారాడు. దీంతో కుటుంబసభ్యులను పట్టించుకోవడం మానేశాడు. సోమవారం నాడు సాయంత్రం ఐదున్నర గంటలకు  ఇంటి పేపర్లు ఇవ్వాలని భార్య, కొడుకుతో ఆయన గొడవపడ్డాడు.

పేపర్లు ఇవ్వడానికి భార్య, కొడుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో హబీబ్ తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు తృటిలో తప్పించుకొన్నారు. వెంటనే హబీబ్ కొడుకు హష్మీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఈ సమాచారం మేరకు పోలీసులు నిందితుడు హబీబ్ ను అదుపులోకి తీసుకొన్నారు.

సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బుల్లెట్ కారణంగా గోడకు రంద్రం ఏర్పడింది. సంఘటన స్థలంలో పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?