సీఎం కాన్వాయ్ ని తిరస్కరించిన రేవంత్ రెడ్డి... 

By Arun Kumar PFirst Published Dec 7, 2023, 11:26 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే ప్రభుత్వ కాన్వాయ్ ని ఉపయోగించేందుకు రేవంత్ రెడ్డి నిరాకరించారు. 

హైదరాబాద్ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని కన్ఫర్మ్ అయ్యింది. సాధారణ ఎమ్మెల్యేగానే ఇటీవల దేశ రాజధానికి న్యూడిల్లీకి వెళ్ళిన ఆయన ముఖ్యమంత్రి పదవితో తిరిగివచ్చారు. దీంతో డిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న కాబోయే ముఖ్యమంత్రి కోసం అధికారులు ప్రత్యేక వాహనాలతో కూడిన కాన్వాయ్ సిద్దం చేసారు. కానీ బాధ్యతలు చేపట్టకుండా ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడానికి ఇష్టపడని రేవంత్ సున్నితంగా తిరస్కరించారు. ఈ ఆసక్తికర సంఘటన బుధవారం  రాత్రి బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకుంది.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవికి అప్పగించిందిన అదిష్టానం. కాంగ్రెస్ సీనియర్లు ఈ పదవికోసం ప్రయత్నించినా అదిష్టానం మాత్రం రేవంత్ పైనే నమ్మకం వుంచింది. రేవంత్ ను డిల్లీకి పిలిపించుకుని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దలు తెలిపారు. అనంతరం  అధికారికంగా ప్రకటించారు.

Latest Videos

ఇలా ముఖ్యమంత్రి పదవి కన్ఫర్మ్ కావడంతో రేవంత్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేసారు. అలాగే బుధవారం రాత్రి డిల్లీ నుండి వస్తున్న రేవంత్ కోసం అధికారులు కాన్వాయ్ ని సిద్దం చేసారు. రేవంత్ ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోగానే సీఎస్ శాంతికుమారి, డిజిపి రవిగుప్తా స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ వద్ద సిద్దంగా వుంచిన కాన్వాయ్ ఎక్కాల్సిందిగా కాబోయే సీఎంను కోరారు అధికారులు. 

Also Read  CM Revanth Reddy : తెలంగాణ యుద్దాన్ని గెలిచివచ్చిన యోధుడికి వీరతిలకం దిద్దిన తల్లి

అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకుండానే ప్రభుత్వ వాహనాలను ఉపయోగించేందుకు రేవంత్ రెడ్డి ఇష్టపడలేదు. దీంతో ప్రభుత్వ కాన్వాయ్ ని తిరస్కరించిన సొంత వాహనంలో అక్కడినుండి వెళ్ళిపోయారు. కానీ భద్రతాకారణాల రిత్యా ఆయన వాహనాన్ని పోలీస్ వాహనాలు అనుసరించాయి. విమానాశ్రయం నుండి నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేసిన గచ్చిబౌలి ఎల్లా హోటల్ కు రేవంత్ చేరుకున్నారు. అక్కడివరకు ఆయన కారును పోలీసులు, సీఎం భద్రతా అధికారులు అనుసరించారు.

click me!