మరియమ్మ లాకప్ డెత్ పై గవర్నర్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..

Published : Jun 25, 2021, 02:52 PM IST
మరియమ్మ లాకప్ డెత్ పై గవర్నర్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..

సారాంశం

గవర్నర్ తమిళిసైను తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిశారు. రాచకొండ పరిధిలో లాకప్ డెత్ మీద గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ లో రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు.

మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దళితులమీద జరుగుతున్న దాడులపై గవర్నర్ కు వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు, టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో లేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. 

గవర్నర్ ను కలిసి వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather